‘అబ్బాయిది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. ఒక్కడే కొడుకు. మంచి కుటుంబం. మరోసారి ఆలోచించండి’ మధ్యవర్తి మాటతో అమ్మానాన్నలు కరిగిపోయారు. ఎదురింటి ఆంటీ నన్ను కోడలుగా చేసుకోవాలని అడిగించడం ఇది మూడోసారి. కన్నవాళ్లు నా అభిప్రాయమడిగారు. అబ్బాయి బాగుంటాడు. మంచి ఉద్యోగం. నేనూ అభ్యంతరం చెప్పలేదు.ముహుర్తం పెట్టుకున్నాం. పెళ్లికింకా మూణ్నెళ్లుంది. నేనూ అందరిలాంటి అమ్మాయినేగా! కాబోయే భర్తతో కబుర్లు చెప్పుకోవాలనీ.. అప్పుడప్పుడు చాటుమాటుగా కలుసుకోవాలని తెగ ఉబలాటంగా ఉండేది. కానీ తను పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు. ఆగలేక నేనే ఓసారి ఫోన్ చేశా. ‘కొత్త ప్రాజెక్టుతో బిజీగా ఉన్నా సంజూ.. పెళ్లయ్యాక నువ్వు చెప్పినట్టే వింటాగా’ అంటూ నా వూహలకు రెక్కలు తొడిగాడు.పెళ్లి ఘనంగా జరిగింది. మొదటిరాత్రి. ‘ముందు మనం స్నేహితుల్లా ఉందాం. ఒకర్నొకరం బాగా అర్థం చేసుకున్నాక నిన్ను భార్యగా అంగీకరిస్తా’ అని చిత్రమైన ప్రతిపాదన తెచ్చాడు తను. ఒప్పుకున్నా. కొన్నాళ్లు గడిచాయి. ఇద్దరి మధ్య కావాల్సినంత ఏకాంతం. అయినా ఆయన కొత్త పెళ్లాన్ని పక్కనపెట్టి ఎప్పుడూ ఫోన్‌తోనే గడిపేవాడు. గంటలకొద్దీ చాటింగ్, ఎవరితోనో మాట్లాడ్డం. బాత్రూమ్‌కెళ్లినా ఫోన్ వదలడు. మొదట్లో వింతగా అనిపించేది. తర్వాత చిరాకేసేది. నేనే చొరవ చేసి మాట్లాడితే మొహం చిట్లించేవాడు. పొరపాటున నా చేయి తగిలితే విసుక్కునేవాడు.
నేను కలలో కూడా ్చహించని విషయాలు చెప్పింది తను. ఆమెకి డబ్బులిచ్చి మరీ మాట్లాడించుకుంటున్నాడట మా ఆయన. అసలు మీ ఆయన సంసారానికే పనికి రాడు అందామె. చదువుకునే రోజుల్లో జూనియర్ అబ్బాయిలను లైంగికంగా వేధించేవాడట. ఇవన్నీ వింటుంటే నా నోట మాట రాలేదు. డాక్టరు దగ్గరికెళ్దాం రమ్మన్నాను. రాలేదు. నాకేం సమస్య లేదు. కావాలంటే నీకు విడాకులు ఇస్తాగానీ నువ్వు చెప్పినట్టు చేయనన్నాడు. విషయం తేటతెల్లమైంది. నా బతుకు బుగ్గిపాలైంది. ఈ మధ్యే మేం విడాకులు తీసుకున్నాం.అతడి గురించి వాళ్లింట్లో ముందే తెలుసు. తెలిసీ ఇలా చేశారు. తమ అబ్బాయి లేదా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే పెద్దవాళ్లు కులం, గుణం, మంచి కుటుంబం, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ల గురించి వెతుకుతారు. అలాగే ఎదుటివాళ్ల పరిస్థితేంటి? అని ఒక్కసారి ఆలోచిస్తే నాలా ఎవరికీ అన్యాయం జరగదు.
© Shekharmine

No comments:
Post a Comment