Saturday, 16 April 2016

అమ్మాయికి చేరువయ్యా... అమ్మకి చేదయ్యా!


ప్రేమంటే ఒకర్నొకరు నచ్చడం కాదు. పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి ఒక్కటవడం కాదు. ప్రేమంటే పేగుబంధాన్ని వదులుకోకపోవడం. పెళ్లంటే కొత్త బంధాల్ని కలపడం... ఇది తెలుసుకునేలోపే అనర్థం జరిగిపోయిందంటున్నాడో యువకుడు.సంక్రాంతి పండక్కి నాన్నని కలవడానికెళ్లా. ఎవరైనా అత్తారింటికో బంధువులింటికో వెళ్తారుగానీ నాన్నని కలవడమేంటి అంటారా? ఔను... ఎందుకంటే అమ్మానాన్నలు ఎప్పుడో విడిపోయారు. నేను, చెల్లి అమ్మ దగ్గరే పెరిగాం. చిన్నప్పట్నుంచి మామయ్యే మా బాగోగులు చూశారు. అమ్మకి తెలియకుండా అప్పుడప్పుడు నాన్నని కలవడం నాకలవాటు. ఈసారీ అదే చేశా.గేటు తీసి లోపలికెళ్తుంటే వాకిట్లో చుక్కలముగ్గు వేస్తున్న చక్కని చుక్క కనపడింది. తను నా మేనత్త కూతురు. ఖచూసుకుంటూ వెళ్లు బావా... ముగ్గు పాడవుతుందిగ అనడంతో మరోసారి తనని చూశా. ఈసారేంటో మరీ అందంగా కనిపించింది. ఇంట్లోకెళ్లి నాన్నతో మాట్లాడుతున్నా పదేపదే తన రూపమే గుర్తొస్తోంది. ఆ వూహల్లో ఉండగానే ఖబావా... స్వీట్‌గ అంటూ చేతిలో పాలకోవా పెట్టింది. ఏంటి స్పెషల్‌ అంటే నాకుద్యోగం వచ్చిందంది. ఓ ముక్క నోట్లో వేసుకొని ఖఈ స్వీట్‌కన్నా బావా అన్న నీ పిలుపే తీయగా ఉందిగ అన్నా. సిగ్గులమొగ్గైంది. ఆపై ఇక చూడాలి. నేను కూర్చుంటే తను నిలబడటం... నేను తిన్నాకే తను భోంచేయడం... ఈసారేంటో తన ప్రవర్తన కొత్తగా ఉంది. నేనూ తన చుట్టే తిరిగేవాణ్ని. మూడ్రోజులు మూడు క్షణాల్లా గడిచాయి.ఇంటికొచ్చాను. ఆ రాత్రి నిద్రపడితే ఒట్టు. కళ్లు మూసినా, తెరిచినా మరదలు గాయత్రినే. ఎన్నాళ్లొ ఆగలేకపోయా. ఓరోజు వాళ్ల నాన్నకు ఫోన్‌ చేసి ఖమీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. తనంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మలా చూసుకుంటాగ అన్నా. వరుసైనోడ్ని, పైగా మంచి ఉద్యోగం. పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే ఓకే చెప్పారు. సంతోషంతో గాయత్రికి చెబితే ఖఛీ పో... నన్ను అంతగా ఇష్టపడితే నాతో ఒక్కమాటైనా చెప్పవా?గ అని అలకపాన్పు ఎక్కింది. ప్రసన్నం చేసుకోవడానికి చాలానే కష్టపడ్డా. కొన్నాళ్లయ్యాక గాయత్రి ఉద్యోగంలో చేరడానికి సిటీకొచ్చింది. వెళ్లి కలిశాను. చేతిలో ఓ ఫొటో ఆల్బమ్‌ పెట్టింది. నేను వూరెళ్లినపుడు జాతరలో, గుడి, చేల దగ్గర దిగిన ఫొటోల తీపి జ్ఞాపకాలన్నీ అందులో ఉన్నాయ్‌.ఉగాదికి వూరెళ్లా. నాకన్నా ముందే మా ప్రేమవిషయం అమ్మకి చేరింది. ఖవాళ్లతో మనకు చాలా గొడవలయ్యాయి. మనకు పొసగదు. మేమో, వాళ్లొ తేల్చుకోగ అన్నారు అమ్మ, మామయ్య, అమ్మమ్మలు. ఎప్పుడో జరిగిన గొడవల్ని మా ప్రేమతో ముడిపెట్టొద్దన్నా వినరే. ఖఅత్తమ్మవాళ్లు ఒప్పుకునేదాకా ఎదురుచూద్దాంగ అంది గాయత్రి. ఆర్నెళ్లు ఇంటిమొహం చూడలేదు. అయినా అమ్మ నుంచి పిలుపు లేదు. మరోవైపు ఖమా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, వేరే సంబంధం చూసుకొమ్మంటావా?గ అని మామయ్య ఒత్తిడి. ఏదో ఒకటి తేల్చుకోవాలని ఇంటికెళ్లా. వాళ్లు పంతం వీడలేదు. నేనో నిర్ణయానికొచ్చా.గాయత్రి కుటుంబసభ్యుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకున్నాం. హైదరాబాద్‌లో కాపురం. కొన్నాళ్లు గడిస్తే అమ్మ మనసు మారుతుందని నా ఆశ. కానీ ఆ అంచనా తప్పింది. మేం చేసినదాన్ని అవమానంగా భావించి కొద్దిరోజులు ఇంట్లోంచి బయటికి రాలేదట అమ్మ, అమ్మమ్మలు. భర్తతోపాటు కొడుకూ మోసం చేశాడని ఏడ్చిందట అమ్మ. చాలా తప్పు చేశాననిపించింది. తర్వాత వెళ్లి క్షమించమని అమ్మ కాళ్లపై పడిపోయా. నోరు విప్పలేదు. మొహం కూడా చూడ్డానికి ఇష్టపడలేదు. నిరాశగా తిరిగొచ్చా. కొన్నాళ్లకు చెల్లి పెళ్లని తెలిసి ఆశగా వెళ్లా. నన్నో అపరిచిత వ్యక్తిలా చూశారు. కన్నీళ్లతోనే అక్షింతలు వేసి తిరిగొచ్చా. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాననే సంతోషం కన్నా నేనే ప్రాణం అనుకున్న అమ్మ నన్ను కాదనుకోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. కొన్నాళ్లు వేచి చూస్తే ఈ దుస్థితి తప్పేదేమో!

© http://naalovestorie.blogspot.in/

ఆమెను ప్రేమించా... అతడితో పెళ్లి చేశా!


చెల్లి కోసం డొంకినవలస రైల్వేస్టేషన్‌లో ఎదురుచూస్తున్నా. అనుకోకుండా నా చూపు అవతలి ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్న అమ్మాయిపై పడింది. కన్నార్పకుండా నన్నే చూస్తోంది తను. ఐదు పది నిమిషాలైనా అదేవరస. ఎంత ఆలోచించినా తనెవరో తట్టలేదు. చెల్లి రాకతో ఆలోచనకు బ్రేక్‌ వేసి అక్కణ్నుంచి కదిలా. వారమయ్యాక ఓ గుడిలో ఎదురుపడింది. అడగాలా? వద్దా? అనుకుంటుండగానే చూపులు విసిరి మాయమైంది. మూడోసారి ముచ్చటగా రోడ్డుమీద కలిసింది. పట్టించుకోకుండా వెళ్తుంటే ఖహలో సర్‌... నేను మీ జూనియర్‌ కీర్తినిగ అంటూ చేయందించింది. తన చొరవకు నోరెళ్లబెట్టా. అమ్మాయే మాట కలిపితే ఏ కుర్రాడికైనా హ్యాపీనే కదా! తర్వాత  ఈమె మా పెద్దమ్మ అంటూ ఇంకొకామెను పరిచయం చేసింది.

కీర్తి నెంబర్‌ కనుక్కోవడం కష్టమేం కాలేదు. వెంటనే ఫోన్‌ కలిపా. బాగానే రిసీవ్‌ చేసుకుంది. పరిచయం పరుగులు పెట్టి తొందర్లోనే ఖఏరాగ, ఖఏమేగ అని చొరవగా పిలుచుకునే దశకెళ్లాం. ఆపై మాటలు దాటి కలుసుకోవడాలూ మొదలయ్యాయి. కొన్నాళ్లకు ఖనువ్వంటే నాకిష్టం. మనం పెళ్లి చేసుకుందాం. ఏమంటావ్‌?గ అంది. నిజానికి నేను అడగాలనుకున్న మాట. సమయం కావలన్నా. ఊసులు, కలుసుకోవడాలు మాత్రం కొనసాగేవి.
ఓరోజు కీర్తి ఒకబ్బాయితో బైక్‌పై కనిపించింది. ఉత్సుకత ఆపుకోలేక ఎవరనడిగా. ఖఓహ్‌... తనా? మా అన్నయ్య శివగ అంది. అనవసరంగా అనుమానించానని తిట్టుకున్నా. వారం తిరక్కముందే మరోసారి కనిపించారు. పక్కన కీర్తి పెద్దమ్మ కూడా ఉంది. ఈసారి ఎలాంటి అనుమానం రాలేదు. పైగా నన్ను శివకి పరిచయం చేసింది.
ఆరోజు ఎప్పట్లాగే తనకి ఫోన్‌ చేశా. తీయలేదు. చాలాసార్లు ప్రయత్నించినా నో రెస్పాన్స్‌. గాబరాగా తన గదికి పరుగెత్తా. తాళం వెక్కిరించింది. ఖమావాళ్లు అద్దె చెల్లించలేకపోతున్నారు. అందుకే ఖాళీ చేసి ఊరెళ్లాగ మర్నాడు తనే చెప్పింది. ప్రాణం విలవిల్లాడింది. అయినా ఫోన్‌ చేయడం మరవొద్దన్నా. సరేనంది.
ఇది జరిగాక తనలో ఒక్కసారిగా మార్పు. నేను తన గురించి అడిగితే తనేమో శివ ఎలా ఉన్నాడనేది. ఎంతైనా అన్నయ్య కదా... ఆమాత్రం ఉంటుందిలే అనుకునేవాణ్ని. ఓసారి ఖమా పేరెంట్స్‌ కొన్ని వస్తువులు కొనడానికి ఊరి నుంచి వస్తున్నారు. వెళ్లి సాయం చెయ్‌గ అంది. సరేనని వెళ్లా. మాటల మధ్యలో ఖకీర్తి ఈ మందుల చీటీ శివకు ఇవ్వమందిగ అన్నారు. నేనిస్తానని ఆ చీటీ తీసుకున్నా. అది విప్పి చూడగానే నాకు కన్నీళ్లాగలేదు. నిజానికి అది మందుల చీటీ కాదు లవ్‌లెటర్‌. అన్నయ్య అని చెప్పిన వ్యక్తి కీర్తి లవర్‌. ఎంత మోసం?
తర్వాత చాలా విషయాలు తెలిశాయి. నన్ను వాడుకోవడం కోసం కావాలనే వాళ్లిద్దరూ కలిసి అలా చేశారు. ఆ పెద్దమ్మ కూడా అబద్ధమే. ఆవేశంతో తనకి ఫోన్‌ చేసి విపరీతంగా తిట్టా. నిజం ఒప్పుకుంది. క్షమించమని ఏడ్చింది. ఖశివనే ప్రేమిస్తున్నాగనంది. ఇంకేం చేయను? తనది మోసమైనా నాది నిఖార్సైన ప్రేమ. అందుకే ప్రపంచంలో ఏ ప్రేమికుడూ చేయని పని చేయాలనుకున్నా. నేను ఇష్టపడ్డ అమ్మాయిని తను ప్రేమించిన అబ్బాయితో కలపాలనుకున్నా. వాళ్లిద్దరి పెద్దల దగ్గరికెళ్లి బతిమాలా. పెళ్లికి ఒప్పుకోకపోగా నానా మాటలన్నారు. కారణం ఇద్దరివీ వేర్వేరు కులాలు. ఖమేం ఒక్కటవకపోతే చచ్చిపోతాంగ అని పంతం పట్టారు కీర్తి, శివలు. ఆఖరికి నేనే దగ్గరుండి వారికి రిజిస్టర్‌ మ్యారేజీ చేశా.
అమ్మాయిని ప్రేమించడం అంటే నా దృష్టిలో అమ్మాయిని మాత్రమే ప్రేమించడం కాదు. ఆమె కష్టాలు... ఇష్టాలు... బాధ్యతలు... సంతోషాల్నీ ప్రేమించగలగాలి. అందుకే వాళ్లని కలిపా. ఒక ప్రేమికుడిగా నేను చేసింది సమంజసమే అనిపిస్తోంది. మీరేమంటారు?

© http://naalovestorie.blogspot.in/