చెల్లి కోసం డొంకినవలస రైల్వేస్టేషన్‌లో ఎదురుచూస్తున్నా. అనుకోకుండా నా చూపు అవతలి ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్న అమ్మాయిపై పడింది. కన్నార్పకుండా నన్నే చూస్తోంది తను. ఐదు పది నిమిషాలైనా అదేవరస. ఎంత ఆలోచించినా తనెవరో తట్టలేదు. చెల్లి రాకతో ఆలోచనకు బ్రేక్ వేసి అక్కణ్నుంచి కదిలా. వారమయ్యాక ఓ గుడిలో ఎదురుపడింది. అడగాలా? వద్దా? అనుకుంటుండగానే చూపులు విసిరి మాయమైంది. మూడోసారి ముచ్చటగా రోడ్డుమీద కలిసింది. పట్టించుకోకుండా వెళ్తుంటే ఖహలో సర్... నేను మీ జూనియర్ కీర్తినిగ అంటూ చేయందించింది. తన చొరవకు నోరెళ్లబెట్టా. అమ్మాయే మాట కలిపితే ఏ కుర్రాడికైనా హ్యాపీనే కదా! తర్వాత ఈమె మా పెద్దమ్మ అంటూ ఇంకొకామెను పరిచయం చేసింది.
కీర్తి నెంబర్ కనుక్కోవడం కష్టమేం కాలేదు. వెంటనే ఫోన్ కలిపా. బాగానే రిసీవ్ చేసుకుంది. పరిచయం పరుగులు పెట్టి తొందర్లోనే ఖఏరాగ, ఖఏమేగ అని చొరవగా పిలుచుకునే దశకెళ్లాం. ఆపై మాటలు దాటి కలుసుకోవడాలూ మొదలయ్యాయి. కొన్నాళ్లకు ఖనువ్వంటే నాకిష్టం. మనం పెళ్లి చేసుకుందాం. ఏమంటావ్?గ అంది. నిజానికి నేను అడగాలనుకున్న మాట. సమయం కావలన్నా. ఊసులు, కలుసుకోవడాలు మాత్రం కొనసాగేవి.
ఓరోజు కీర్తి ఒకబ్బాయితో బైక్‌పై కనిపించింది. ఉత్సుకత ఆపుకోలేక ఎవరనడిగా. ఖఓహ్... తనా? మా అన్నయ్య శివగ అంది. అనవసరంగా అనుమానించానని తిట్టుకున్నా. వారం తిరక్కముందే మరోసారి కనిపించారు. పక్కన కీర్తి పెద్దమ్మ కూడా ఉంది. ఈసారి ఎలాంటి అనుమానం రాలేదు. పైగా నన్ను శివకి పరిచయం చేసింది.
ఆరోజు ఎప్పట్లాగే తనకి ఫోన్ చేశా. తీయలేదు. చాలాసార్లు ప్రయత్నించినా నో రెస్పాన్స్. గాబరాగా తన గదికి పరుగెత్తా. తాళం వెక్కిరించింది. ఖమావాళ్లు అద్దె చెల్లించలేకపోతున్నారు. అందుకే ఖాళీ చేసి ఊరెళ్లాగ మర్నాడు తనే చెప్పింది. ప్రాణం విలవిల్లాడింది. అయినా ఫోన్ చేయడం మరవొద్దన్నా. సరేనంది.
ఇది జరిగాక తనలో ఒక్కసారిగా మార్పు. నేను తన గురించి అడిగితే తనేమో శివ ఎలా ఉన్నాడనేది. ఎంతైనా అన్నయ్య కదా... ఆమాత్రం ఉంటుందిలే అనుకునేవాణ్ని. ఓసారి ఖమా పేరెంట్స్ కొన్ని వస్తువులు కొనడానికి ఊరి నుంచి వస్తున్నారు. వెళ్లి సాయం చెయ్‌గ అంది. సరేనని వెళ్లా. మాటల మధ్యలో ఖకీర్తి ఈ మందుల చీటీ శివకు ఇవ్వమందిగ అన్నారు. నేనిస్తానని ఆ చీటీ తీసుకున్నా. అది విప్పి చూడగానే నాకు కన్నీళ్లాగలేదు. నిజానికి అది మందుల చీటీ కాదు లవ్‌లెటర్. అన్నయ్య అని చెప్పిన వ్యక్తి కీర్తి లవర్. ఎంత మోసం?
తర్వాత చాలా విషయాలు తెలిశాయి. నన్ను వాడుకోవడం కోసం కావాలనే వాళ్లిద్దరూ కలిసి అలా చేశారు. ఆ పెద్దమ్మ కూడా అబద్ధమే. ఆవేశంతో తనకి ఫోన్ చేసి విపరీతంగా తిట్టా. నిజం ఒప్పుకుంది. క్షమించమని ఏడ్చింది. ఖశివనే ప్రేమిస్తున్నాగనంది. ఇంకేం చేయను? తనది మోసమైనా నాది నిఖార్సైన ప్రేమ. అందుకే ప్రపంచంలో ఏ ప్రేమికుడూ చేయని పని చేయాలనుకున్నా. నేను ఇష్టపడ్డ అమ్మాయిని తను ప్రేమించిన అబ్బాయితో కలపాలనుకున్నా. వాళ్లిద్దరి పెద్దల దగ్గరికెళ్లి బతిమాలా. పెళ్లికి ఒప్పుకోకపోగా నానా మాటలన్నారు. కారణం ఇద్దరివీ వేర్వేరు కులాలు. ఖమేం ఒక్కటవకపోతే చచ్చిపోతాంగ అని పంతం పట్టారు కీర్తి, శివలు. ఆఖరికి నేనే దగ్గరుండి వారికి రిజిస్టర్ మ్యారేజీ చేశా.
అమ్మాయిని ప్రేమించడం అంటే నా దృష్టిలో అమ్మాయిని మాత్రమే ప్రేమించడం కాదు. ఆమె కష్టాలు... ఇష్టాలు... బాధ్యతలు... సంతోషాల్నీ ప్రేమించగలగాలి. అందుకే వాళ్లని కలిపా. ఒక ప్రేమికుడిగా నేను చేసింది సమంజసమే అనిపిస్తోంది. మీరేమంటారు?
© http://naalovestorie.blogspot.in/

No comments:
Post a Comment