అందుబాటులో ఉన్నపుడే బందాన్ని అందుకోవాలి. అందకుండా పోయాక ఎంత వగస్తే మాత్రం ఏం లాభం?
ఛీ ఛీ...ప్రేమా? గాడిద గుడ్డా? అదో టైం వేస్ట్ వ్యవహారం' స్నేహితులతో ఇలా ఎన్నిసార్లు అనుంటానో లెక్కేలేదు.నాకు నచ్చని ఓకే ఒక పదం ప్రేమ.నేను ఎష్టపడింది కేవలం పుస్తకల్నే. అందుకే ఇంటర్ లో టాపర్ని.ఇంజనీరింగ్ లో కాలేజి ఫస్ట్.నాలుగైదు కంపెనీలు ఆహ్వానం పలికాయి.అందులో నాకు నచ్చిన సంస్థలో చేరిపోయా.
పుణేలో ఉద్యోగం కొత్త చోటు బెరుగ్గా ఆఫీసు లో అడుగు పెట్టా 'హాయ్ నేను శేఖర్.మాది మీ ఉరేనండి' అంటూ మాట కలిపాడో వ్యక్తి. నా బయోడేటా ముందే పట్టేశాదేమో? ఏదేమైనా తనదీ మా ఊరే అనగానే ప్రాణం లేచొచ్చింది.బాస్ కి పరిచయం దగ్గర్నుంచి, హెచ్ ర్ పర్మాలితిస్ దాకా అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఆపై సహోద్యోగులతో పరిచయం.బాగా కలిసిపోవడంతో నేనూ వాళ్ల బృందంలో సబ్యురాలినయ్యా.క్యాంటీన్ బాతాఖానీలు, వీకఎండ్ లో సరదా పార్టీలతో జాలిగా గడిచిపోయేది జీవితం.
శేఖర్ కి మొదట్నుంచి నా పై ప్రత్యేక అభిమానం.నాకు నచ్చిన రంగుల చొక్కాలే వేసుకునేవాడు.తనకిష్టం లేకపోయినా నా అభిరుచిల్ని ఆచరించాడు.నేను నిద్రపోయే దాకా తన సందేశాల వెల్లువ నా సెల్ ని తకుతూనే ఉండేది. నా వ్యక్తిత్వం మేచుకుంటూ 'అమ్మాయంటే ఇలా ఉండాలి' అని కొలీగ్స్ తో చెప్పిన సందర్భాలెన్నో.నేను నేను అనారోగ్యంగా ఉంటే తనకే టెన్షన్.ఇవన్నీ శేఖర్ నా పై పెంచుకున్న ప్రేమకి సంకేతాలని తెలుసుకోలేనంత అమాయకురలినేం కాదు.
ఆ అభిమానం,అప్యాయతకి నేను పడిపోయా.కానీ తనే ముందు ఐ లవ్ చెప్పాలని బెట్టు చేశా. అదెంత తప్పుడు నిర్ణయమో తర్వాత తెల్సింది.
ఆరోజు ఎప్పట్లాగే సహోద్యోగులం కబుర్లలో మునిగాం. మాటల మధ్యలో 'నాకు కుదిరింది'అన్నాడు శేఖర్.ఆట పట్టిస్తునాడనుకున్నా. అమ్మాయి పూర్తీ వివరాలు చెబుతుంటే కన్నీలాగలేదు.మాట మాత్రం చెప్పకుండా ఎందుకిలా చేశాడో అర్ధం కాలేదు.కొలీగ్స్ వెళ్ళాక అతడ్ని పట్టుకొని ఏడ్చేశా.'అవును నేను నిన్ను ప్రాణంలా ప్రేమించా.కాని నీ నుంచి స్పందన లేకపోతే నేనేం చెయనూ?' అన్నాడు.పొరపాటు నాదేనని ఒప్పుకున్నా.'ఇప్పటికైనా పెళ్లి క్యాన్సల్ చేసుకో' అని ప్రదేయపడ్డా. నా చేతుల్లో ఏం లేదంటూ నన్ను దుఖ సాగరంలో ముంచాడు.చెజేతులా మంచి వ్యక్తిని కోల్పోయాననే భాదతో నిద్ర కరువైంది. తిండి తిప్పల్లేవ్.అయినా శేఖర్ పట్టించుకోలేదు.ఒకప్పుడు క్షణం తీరిక దొరికినా నాతో సన్నిహితంగా ఉండాలనుకునేవాడు.ఒంట్లో నలతగా ఉందంటే తల్లడిల్లిపోయేవాడు. ఇప్పుడేమో కాబోయే శ్రిమతికే ప్రాదాన్యం ఇస్తున్నాడు. అస్తమానం ఒకటే ఫోన్లు. తట్టుకోలేకపోతున్నా.ఆఫీసు కెళ్తే నరకానికి వెళ్లినట్లే ఉంది. ఉద్యోగం మానేస్తే ఇంట్లో కష్టం.బెట్టు చేయకుండా ఓ మెట్టు దిగి అతడ్ని ఇష్టపడుతున్నాని చెప్పి ఉంటె ఈ మానసిక క్షోభ తప్పేదే.

No comments:
Post a Comment