ఎల్లలు లేనిది స్నేహం. హడ్డుల్ల్లో ఉండాల్సింది ప్రేమ! అవి రెండూ కలవని సమాంతర రేఖలు.అది మర్చిపోయి స్నేహం పరిధుల్లో ప్రేమ చొరబడితే...
నీ గురించి చెప్పు...' అని ఎవరైనా నన్నడిగితే ముందు నా నోటి నుంచి వచ్చేది పండు, సురేష్ , రవి, వెంకట్ ల పేర్లే.వాళ్ళంతా నా జిగిరి దోస్తులు.మేం కేర్ మన్న దగ్గర్నుంచి ప్రతి కేరింతలో ఒకరికొకరం తోడున్నాం. సంతోషాన్ని మూకుమ్మడిగా జుర్రుకున్నాం.కష్టాల్ని కలిసి పంచుకున్నాం.అందుకే మా ఉళ్లో మేం స్నేహానికి ప్రతిరూపం .
అలాంటి స్నేహానికి కుదుపు. పై చదువుల కోసం నేను,పండు నగరానికి వచ్చాం. సురేష్ ఉద్యోగం కోసం వేరే ఉరికెళ్ళాడు. రవి పరీక్షల్లో దింకి కొడితే,వెంకట్ ఉళ్లోనే చదువుతున్నాడు.ఇన్నేళ్ళలో మేం ఎప్పుడు ఇంత దూరం లేము. అందర్లో బాధ. బాగా అలోచించి నేనో ప్రతిపాదన తెచ్చా.'అందరం కలిసి సిటీలో గది అద్దెకు తీసుకుందాం.చదువు,ఉద్యోగం కలిసే కొనసాగిద్దాం'అని.అంతా ఖుషీ.వెంకట్ తప్ప నలుగురం హైదరాబాద్ చేరం కొన్నాళ్లకే 'అన్నయ్యా...చదువుకోవడానికి నేనూ సిటీకోస్తా' అంది పండుగాడి చెల్లెలు.సంతోషంగా ఆహ్వానించాం.మంచి కాలేజీలో చేర్చాం.కానీ తన రాక మా స్నేహానికి పొగ పెడుతుందని ఉహించాలేకపోయాం.
ఒక రోజు పండు నాతో కోపంగా,'నువ్వు రవిగాడు కలిసి నన్నిత మోసం చేస్తారా?'అని అరిచాడు.నాకర్ధం కాలేదు.'అసలేమైందో చెప్పరా' అన్నా భుజం మీద చెయేస్తూ. ఓ లెటర్ తీసుకొచ్చి నాకిచ్చాడు.అది రవిగాడు పండు చెల్లెలికి రాసిన ప్రేమలేఖ. నా మతిపాయింది. ఏడాదిగా ఈ వ్యవహారం కొనసాగుతోందట. ఇదంతా నాకు తెలిసే జరుగుతోందనుకుంట్టునాడు పండు నాకేం తెలియదంటే నమ్మడే. ఆ వెంటనే గది ఖాలీ చేసి వెళ్లిపోయాడు.అలా మాలో ఒకడు దూరం.
ఏళ్లకేల్లూ సాహసం చేస్తేగానీ మనసుకి నచ్చిన మిత్రుడ్ని పొందలెం. విడిపోవాలంటే మాత్రం క్షణాలు చాలు.అదే మాట చెప్పి 'ఇప్పటికైనా పద్ధతి మార్చుకొమ్మని రవికి సలహా ఇచ్చాం.వాడు పట్టించుకోలేదు.పైగా చదువు వదిలేసి జులాయిలా తిరిగేవాడు. మేం విడిపోయిన సంగతి వాళ్ళమ్మకి తెలిసింది.'మిరున్నారని మవాడ్ని అంత దూరం పంపితే అలా గాలికోదిలేస్తారా? ' అంటూ మమ్మల్ని నిలదీసింది. అసలు విషయం అమెకేం తెలుసు? వాడు బాగుపడాలని అన్ని రకాలుగా ప్రయత్నించి చూశా. చివరికి నచ్చ చెప్పమని నలుగురు ఫ్రెండ్స్ ని పురమాయించా అదే నేను చేసిన తప్పు.మాటా మాటా పెరిగి నా ఫ్రెండ్స్,రవి కొట్టుకున్నారు. 'నీ ఫ్రెండ్స్ తో నన్ను కొట్టిస్తావా? నీ అంతుచూస్తా నంటూ వాడూ నాకు శత్రువయ్యాడు. రెండో వాడూ దూరం. ఆపై ఈ గొడవలకు దూరంగా ఉండాలని కలిసున్నవల్లము విదిపోయాం.
ఒక్కడి నమ్మకద్రోహం ఇంతమందిని విడదీసింది.కానీ ఒక్కటి మాత్రం నిజం.స్నేహం ముసుగులో సొంత చెల్లెల్ని ప్రేమిస్తునంటే ఏ అన్నయ్యా ఒప్పుకోడు. ముఖ్యంగా చదువు,ఉద్యోగం,క్యారెక్టర్ లేనివాడ్ని. ఆ విషయం ఒకప్పటి నా నేస్తం తెలుసుకోవాలి. మా అనుభవం మాలాంటి స్నేహితులకు పాఠం కావాలి.

No comments:
Post a Comment